ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే దానిని సీజ్ చేయడం జరిగింది.. స్వీట్ షాపుల్లో మిగిలిపోయిన లేదా కాలం చెల్లిన స్వీట్స్ ని అన్నిటిని ఇక్కడికి చేర్చి వాటితో మళ్లీ కొత్త స్వీట్స్ తయారు చేసి అదే స్వీట్ షాప్ లోకి పంపిస్తున్నారు. కాలం చెల్లిన స్వీట్స్ ని రీసైకిల్ చేసి కొత్త స్వీట్స్ పై కొత్త లేబులింగ్ చేసి తిరిగి షాపుల్లోకి సప్లై చేస్తున్నారు.. దీంతో పాటు నాసిరకం వస్తువులను వాడుతున్నారు.. అపరిశుభ్రత మధ్యలో స్వీట్స్ ను తయారుచేసి సప్లై చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణలో బయటపడింది ..దీంతో స్వీట్ షాపు స్వీట్ కర్మగారాన్ని వెంటనే అధికారులు సీజ్ చేశారు.. దాని లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ..
మల్లాపూర్ లో అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడిలో, సరైన పరిశుభ్రత మరియు పారిశుధ్య నిర్వహణ లోపం, ఆహార పదార్థాల లేబులింగ్, రికార్డుల గడువు ముగిసిన ఆహార పదార్థాలను చూసి అవాక్కు అయ్యారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్లు తయారీలో వాడటన్ని, పరిశుభ్రత లేని ప్రదేశం లో తయారు చేయడం అధికారులు గుర్తించారు. వేరే జిల్లా లో తీసుకున్న లైసెన్సు తో మల్లాపూర్ లో పరిశ్రమను ఏర్పాటు చేయడం పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సు క్యాన్సల్ చేస్తున్నామని తెలిపారు. శాంపిల్ ను సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నమని తెలిపారు.
Salman Khan : సౌత్ ఇండియా ప్రేక్షకులు మా సినిమాలు చూడట్లేదుః సల్మాన్ ఖాన్