Alert.. Alert: తెలంగాణ ప్రజలు పగటి పూట పనుల మీదూ, పండుగ పూట ఊరెళ్లాలనే ప్రణాళికలలో బిజీగా ఉన్న ఈ సమయంలో… ఒక్కసారిగా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. “బస్సులు బంద్!”.. అవును, ఈ అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు ఆగిపోనున్నాయి. జనజీవనం స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కి ఇది భలే ఛాన్స్… రెట్లు రేట్లతో డబ్బు దండుకునే సమయం వచ్చేసింది. గతంలో ఎన్నోసారి చూసిన దృశ్యం మళ్లీ రిపీట్ కానుంది. ప్రయాణికుల…
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
MP Laxman : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కుల గణనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు స్పందన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, “రేవంత్ డీఎన్ఏలో అసలు కాంగ్రెస్ పార్టీ విలువలు లేవు” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కుల గణనకు ఎప్పటి నుంచో వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు ఓబీసీపై మొసలి కన్నీరు కారిస్తుంటే,…
హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ మండలం కోహెడలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోహెడలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు, అక్కడే ఉన్న ఒక ఫామ్‌హౌస్ యాజమాన్యానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. వివరాల ప్రకారం, కోర్టు ఆదేశాల మేరకు తమ ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్న యజమానులను ఫామ్‌హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. అనంతరం ఫామ్‌హౌస్ వర్గీయులు ప్లాట్ల యజమానులపై రాళ్లు ,…
Hyderabad: హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న కొత్త నిర్ణయాలు, వాటి వివరాలను సీపీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను 35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ చేయడానికి ఉత్తర్వులు చేసారు. ఈ జి.ఓ. ప్రకారం రెండు అదనపు లా అండ్ ఆర్డర్ జోన్లు (సౌత్ ఈస్ట్ + సౌత్ వెస్ట్), 11…
Bandi Sanjay :ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ లోని మర్రి…
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రముఖ యూట్యూబర్ శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్యామ్‌పై ఎక్స్టార్షన్ కేసు నమోదు చేశారు. అనంతరం శ్యామ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల ప్రకారం, శ్యామ్ సదరు వ్యాపారవేత్తను బెదిరించి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…
మెట్రో రైలు లో బెట్టింగ్ ప్రమోషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. అడ్వకేట్ నాగూర్ బాబు ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్ పై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందులో పేర్కొన్నారు. రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో ఐఏఎస్, ఐపీఎస్ లు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలా ప్రమోషన్ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.