Terrorist Attack : దేశవ్యాప్తంగా శాంతి భద్రతలకు పతనం కలిగించేందుకు కుట్రలు నడుస్తున్న దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేలుళ్ల కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న గ్రూపును భద్రతా సంస్థలు పట్టు పట్టాయి. ఇందులో ఆరుగురు సభ్యులతో కూడిన తీవ్రవాద సంస్థ “అల్-హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్” కీలక పాత్ర పోషిస్తోంది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ జీవితం ఒక సాధారణ యువకుడి ప్రయాణంలా మొదలైంది. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి…
Ponnam Prabhakar : హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో గుల్జార్ హౌజ్ వద్ద ఈ నెల 18న జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ప్రభుత్వ చర్యలపై స్పష్టతనిచ్చారు. ఈ విచారణ కమిటీకి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ…
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని మైలార్ దేవ్ పల్లెలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని వాళ్లంతా..
హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Ponnam Prabhakar : హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి…
Tragedy : హైదరాబాద్ శివారులోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. న్యూగ్రీన్ సిటీ ప్రాంతంలో నివసించే నజియా బేగం (30)ను ఆమె భర్త జాకీర్ అహ్మద్ (31) హత్య చేశాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో గోల్కొండ ప్రాంతంలో ఉండే ఈ దంపతులు, లోకల్ బ్రోకర్ సిరాజ్ ద్వారా ఈ ఇంటిని కిరాయికి తీసుకున్నారు. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు…
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.