GHMC : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 500 మంది సిబ్బంది ఎన్నికల డ్యూటీలో పాల్గొననున్నారు. వీరిలో 250 మంది పోలీసులున్నారు. భద్రతా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న…
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.
NIMS : హైదరాబాదులోని నిమ్స్ (NIMS) హాస్పిటల్లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఘటనకు గల ప్రధాన కారణం సిగరెట్, చెత్త వల్లేనని పోలీసులు తేల్చారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందిస్తూ, వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. గంట వ్యవధిలోనే మంటల్ని కంట్రోల్ చేసిన ఫైర్ టీమ్ మెరుగైన చర్యలందించింది. అయితే మంటల…
Bandi Sanjay : జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…
Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు…
MMTS Train Case: హైదరాబాద్ లోని MMTS ట్రైన్లో అత్యాచారయత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ట్రైన్ లో యువతి పై జరిగినదన్న అత్యాచారం అబద్ధంగా తేలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ట్రైన్ లోనుండి జారిపడిన యువతి, అనంతరం తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది. ఆమె కథనాల…
Hyderabad Metro: 2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు…
హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు 11 గంటల పాటు విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. శ్రవణ్ రావు వద్ద నుండి స్వాధీనం…