Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..! సమాచారం…
Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ రోజు కూడా మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మరోసారి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. Murder Mystery : బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు.. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని…
MLC Kavitha : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు.…
Telangana Jagruthi : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 4న బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ…
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి, అప్పుడే పుట్టిన బాబు మృతి చెందారు. స్టాఫ్ నర్స్ గర్భిణీ స్ర్తీకి డెలివరి చేసింది. ఆయమ్మ సహాయంతో.. ఇద్దరూ కలిసి డెలివరి చేయడంతో తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా మరి మృత్యువాత పడ్డారు..
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు.. ఈనెల 5వ తేదీలోగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నాడు..హైదరాబాద్‌కు చేరుకున్న మూడు రోజులు తర్వాత విచారణ అధికారుల ఎదుట హాజర అవుతారని చెప్పారు.. సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైనట్లు అనుచర వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది..
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్‌నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది.
Death Threats : హైదరాబాద్ శివారులోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ రాజకీయ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ లేఖ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇంటి ముందు తులసి మొక్కను ధ్వంసం చేసి, కారుపై బెదిరింపు లేఖ ఉంచిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాపూర్‌నగర్‌కు చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్‌ను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తి లేఖలో హెచ్చరించాడు. రాఘవేందర్ గౌడ్,…