GHMC : జీహెచ్‌ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీ…
Sridhar Babu : హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య భరిత నగరంగా మారకుండా ఉండేందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామన్నారు. “బీఆర్ఎస్ పాలనలో ఫ్రీహోల్డ్ ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హఠాత్తుగా వ్యతిరేకించడం ప్రజలకు అర్థమవుతుంది.…
Special : హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్‌హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్గా మారుతోంది.…
GHMC : హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత విస్తరింపజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి సేవల్లో సమాన స్థాయి అందించడం…
Kishan Reddy: ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు…
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్‌పేట్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం ఆయనను కలిసింది. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలియజేస్తూ,…
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు,…
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.
కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్…