Special : హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్‌హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్గా మారుతోంది.
ఈ సమస్యకు పెర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే – అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఫైబర్, కమ్యూనికేషన్ కేబుల్స్… అన్నీ భూమి కిందకు తరలించబడతాయి. దీనివల్ల నగరానికి గ్లోబల్ స్టాండర్డ్ లుక్ వస్తుంది. అంతేకాదు, వర్షాలు, తుఫానుల సమయంలో విద్యుత్ అంతరాయాలు చాలావరకు తగ్గిపోతాయి. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్ అనేది అంత ఈజీ కాదు. అండర్ గ్రౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే డెవలప్ అయిన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌కు అడ్డు లేకుండా డ్రిల్లింగ్, డక్టింగ్ పనులు నిర్వహించడం పెద్ద ఛాలెంజ్.
ప్రతి ప్రాంతంలో భూగర్భ మౌలిక సదుపాయాలు ఒకే విధంగా లేకపోవడం, ఇప్పటికే ఉన్న పైప్‌లైన్స్, ఇతర కేబుల్స్‌ను డిస్టర్బ్ చేయకుండా పని చేయడం అనేది టెక్నికల్‌గా చాలా కాంప్లెక్స్. అయినప్పటికీ, హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చాలంటే ఈ ట్రాన్సిషన్ తప్పనిసరి. ప్రపంచంలోని ముఖ్యమైన నగరాలు ఇప్పటికే ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్‌ను సక్సెస్ చేశాయి. కాబట్టి, దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి స్పెషల్ ప్లాన్స్, పెద్ద ఎత్తున ఫండింగ్ అవసరం. హైదరాబాద్ వైర్‌లెస్ సిటీగా మారే లక్ష్యం కేవలం ఒక కల కాదు, అది భవిష్యత్ అవసరం కూడా..!
TV Offer: వర్త్ వర్మ వర్త్.. TCL 55 అంగుళాల టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్..!