హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులు హాజరయ్యారు.
డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది.…
CM Revanth Reddy : వర్షాలు పడిన ప్రతీసారీ హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న నీటి చేరిక, ట్రాఫిక్ జాం, లోతట్టు ప్రాంతాల్లో వరద వంటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తరువాత నగరంలో ఏర్పడిన అతలాకుతల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిపారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం…
Bhatti Vikramakra : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. మా ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పెండింగ్…
Ponnam Prabhakar: హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు నిర్వహించిన ధర్నాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాదు.. హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మండిపడ్డారు. Read…
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. “CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, “మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్…
Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం, బాగున్నారా..? అంటూ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టిన ఆయన అనేక అభివృద్ధి అంశాలపై స్పందించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సరిగా సాగడంలేదని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పనుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొన్నామని, వేగంగా పూర్తి చేయడంకోసం కొత్త కాంట్రాక్టర్ను నియమించామని తెలిపారు. వచ్చే పది నెలల్లో ఫ్లై…
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…