GHMC : హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత విస్తరింపజేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయాలని నిర్ణయించింది.
ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వంటి సేవల్లో సమాన స్థాయి అందించడం ప్రధాన ఉద్దేశ్యంగా కేబినెట్ పేర్కొంది. GHMC పరిధి పెరగడం వల్ల పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడంతో పాటు మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విలీనం ప్రతిపాదనపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ GHMC కమిషనర్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
27 పరిసర మున్సిపాలిటీల విలీనం వల్ల హైదరాబాద్ నగర విస్తరణ ఒకే పట్టణాభివృద్ధి వ్యవస్థ కిందకి వస్తుంది. ఇప్పటివరకు అసంఘటితంగా జరిగిన విస్తరణపై కట్టడి ఉండగలదని అధికారులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధమైన రోడ్లు, కాలువలు, డిజిటల్ గవర్నెన్స్, నీటి మౌలిక వసతుల్లో మెరుగైన సేవలు అందించే అవకాశం పెరుగుతుంది. మెట్రోపాలిటన్ ప్లానింగ్‌కి ఈ అడుగు బలాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనెక్టివిటీ, ట్రాన్సిట్ నిర్వహణ, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. అన్నీ ఒకే గొడుగు కింద GHMC పరిధిలో అమలు చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.
అంతేకాకుండా, పెద్ద సంస్థగా GHMCకి ఉన్న సంస్థాపన సామర్థ్యం కారణంగా చిన్న మున్సిపాలిటీలతో పోలిస్తే సేవల పంపిణీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఫిస్కల్ మేనేజ్‌మెంట్, ఈ-గవర్నెన్స్ వంటి రంగాల్లో కూడా మెరుగుదల రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బలాబలాలపై కాంగ్రెస్ అంచనా..
