Bomb In Flight: అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు…
Shamshabad Airport: కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాస్, పన్నెండు ఇగువానాస్ లను స్వాధీనం చేసుకున్నారు. Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు ఈ…
Ganjai : గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్‌పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు.…
Fraud : అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు…
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని……
RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో…
Hyderabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగాడు. సమస్య తలెత్తిన సమయంలో కార్గో విమానంలో మొత్తం…
Flight Delay : హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన విమానం టేక్ ఆఫ్‌కు ముందు అనుకోకుండా ఆగిపోవడంతో, తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులు తీవ్రంగా నిరాశ చెందారు. విమాన సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే, అధికారులు టేక్ ఆఫ్‌ను నిలిపివేశారు. అయితే, దీనిపై ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో, వారు…
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు.