శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యవసర ల్యాండింగ్ ప్రకటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, క్షేమంగా విమానం ల్యాండ్ అవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానంలో ఉన్న 73 మంది ప్రయాణికులు ఉన్నారు.