Bomb In Flight: అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాన్ని హైదరాబాద్‌కు రాకముందే హుటాహుటిన ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు.
కాగా.. విమానం దారి మళ్లింపు జరిగింది కానీ, తాజా సమాచారం ప్రకారం ఇండిగో విమానం ముంబైలో ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ఈ పరిణామంతో విమానంలో ఉన్న పైలట్‌తో సహా ప్రయాణికులందరూ భయం గుప్పెట్లో ఉన్నారు. విమానంలో అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందితో పాటు ముంబై ఎయిర్‌పోర్టు సిబ్బంది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. విమానం సురక్షితంగా ల్యాండైన తర్వాత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టనున్నాయి.
TPCC Meeting: నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం..!