Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. అత్యవసరంగా కార్గో విమానం ల్యాండింగ్
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.
- చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానంలో తలెత్తిన ల్యాండింగ్ గేర్ సమస్య.
- ఎయిర్‌పోర్ట్ అధికారుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగాడు. సమస్య తలెత్తిన సమయంలో కార్గో విమానంలో మొత్తం 6 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.
Read Also: Punjagutta Murder Case: ప్రతిరోజు ‘యూ బెగ్గర్’ అంటూ అవమానించేవాడు
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఇక మరో ఘటనలో, హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుడు ఈ డబ్బును ఎక్కడి నుంచి సంపాదించాడు? దాన్ని ఎక్కడ వినియోగించాల్సి ఉంది? అనే అంశాలపై విచారణ చేపట్టారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ అధికారుల అప్రమత్తత వల్ల, ఈసారి పెద్ద ప్రమాదం తప్పినంత మాత్రాన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!