Wife Protest: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది మొదటి భార్య. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్, శిల్ప దంపతులు 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత ఐదు సంవత్సరాల నుండి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు భర్త. Low Birth Weight Babies: తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలు త్వరగా…
సంక్రాంతి వేడుకల్లో పతంగులు ఎగరేయడం ఒక భాగం. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తూ ఖుష్ అవుతుంటారు. అయితే ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాద భారిన పడి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కరెంట్ షాక్ తో, బిల్డింగ్ పై నుంచి పడి మృత్యువుని కొనితెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా చైనా మాంజా పీకలు కోస్తోంది. మనుషులతో పాటు, పక్షులను కూడా హరిస్తోంది. బైకులపై వెళ్తున్న వాహనదారుల మెడలకు తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది.…
హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ICRTF) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుండి తరలివచ్చిన 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వైద్య వృత్తిలోని గొప్పతనాన్ని, సమాజం పట్ల వారికి ఉండాల్సిన బాధ్యతను…
Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి.
Best City for Women: భారతదేశంలో మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూర్ నిలిచింది. చెన్నై కేంద్రంగా ఉన్న వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. సామాజిక మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రీయల్ ఇంక్లూషన్ వంటి వాటి ఆధారంగా దేశంలోని 125 నగరాలు మహిళలకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో అంచనా వేసింది. బెంగళూర్ 53.29 ఇంక్లూషన్ స్కోర్(CIS)తో అగ్రస్థానంలో ఉండగా, చెన్నై (49.86), పూణే (46.27) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్…
Animal Blood Racket: హైదరాబాద్‌లో సంచలనంగా మారిన గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్…
Drug Racket Busted: హైదరాబాద్ (పేట్‌బషీరాబాద్) నగరంలో నిర్మాణ రంగం, ఇంటీరియర్ డిజైనింగ్ పనుల కోసం రాజస్థాన్ నుండి వలస వచ్చిన కళాకారులే లక్ష్యంగా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్‌బషీరాబాద్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ఛేదించింది. పాన్ మసాలాలో కలుపుకుని.. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ మరియు…
Road Accident: శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన TGSPDCL ఉద్యోగి అశోక్ మృతి చెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జనవరి 7 ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ – పెరుంబవూర్ MC రోడ్డులోని త్రిక్కలత్తూర్, కవుంపాడు వద్ద జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డవారిలో కొడుకు, అల్లుడు…
కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్ లోని ఆలయం లో భారీ చోరీ చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని మూలవిరాట్ కు సంబంధించిన ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు.…
సంఘటిత జీఎస్టీ (GST) పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర-ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో, భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. 2025 జనవరి…