పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి స్టేషన్ నుంచి నాగిరెడ్డి పారిపోయిన విషయం తెలిసిందే. చోరీ కేసులో అరెస్ట్ అయిన తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డి. విచారణ కోసం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకు వచ్చారు. వాష్ రూమ్ పేరుతో స్టేషన్ బాత్రూం నుంచి బయటికి వెళ్లి పరారయ్యాడు నాగిరెడ్డి. నాగిరెడ్డి పరారితో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెడ్…
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య…
గంజాయి సరఫరా, వినియోగానికి పట్టుపగ్గాలు లేకుండా పోతోంది. డ్రగ్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలో హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుకెట్ దేశం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానం సీట్ నెంబర్ 16, 17 లలో హైడ్రోపోనిక్ గాంజాయి వదిలి వెళ్ళారు…
హైదరాబాద్లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న విషయం బయటపడడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇటీవల హైదరాబాద్కు వచ్చి బంజారాహిల్స్ పరిధిలో నివాసం ఏర్పరుచుకుని కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం… పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు.…
కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జనవరి 4) హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఇటీవల మరణించిన టీడీపీ…
CM Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మీరాలం బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి.. ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అవుతుంది. దాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
CM Revanth Reddy: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ అనంతగిరిలో ప్రారంభం అయి.. వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది..
Hyderabad Fog: హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇవాళ ( జనవరి 2న) ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్మేశాయి. తెల్లవారుజాము నుంచి కనిపించిన ఈ పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కాశ్మీర్ లోయను తలపించేలా కనిపించాయి.
CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి…
జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్లో మరో స్టడీ టూర్కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి…