బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే జమ్మి కుంట మండలంలో హై డ్రామా నెలకొంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ కిషన్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనికీ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిని సీపీ సోదా చేయడంతో అక్కడి…
న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో…
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్‌తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్…
పొలిటికల్ హై ఓల్టేజ్ థ్రిల్లర్ హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 36వేల 283 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు లక్షా 17 వేల 563. మహిళా ఓటర్లు లక్ష18 వేల 719 మంది. ఎన్నికల నిర్వహణ కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకూ ఓటర్లు…
ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్‌ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడారు. రేపటి ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం అని చెప్పిన ఆయన ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. బ్లైండ్ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశాం. 32 మంది మైక్రో అబెజర్వేషన్లు ఉన్నారు. 3868 మంది పోలీసు బలగాలు బందోబస్తు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసాం. కోవిడ్ నిబంధనలతో…
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ప్రచారపర్వం ముగిసిన క్షణం నుంచి ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఓటర్ల కొనుగోలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ఒక్క ఓటుకు వేలల్లో ధర పలుకుతున్నట్టు సమాచారం. పార్టీల నుంచి డబ్బు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాలకు దిగటం ఈ ఎన్నికల్లో హైలైట్. ఇలాంటివి గతంలో ఎన్నడూ…
హుజురాబాద్ ఎన్నికల్లో పోలీసులు వన్‌సైడ్‌గా చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత జి. వివేక్.. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.. వరంగల్‌లోని గాయత్రి గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశానికి వచ్చిన హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసులకు నచ్చజెప్పి హోటల్‌కు వెళ్లారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మంత్రులు ప్రెస్ మీట్ పెడితే అడ్డుకోని పోలీసులు.. బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?…