కాలంతో పాటు ఎన్నికల ప్రచారం తీరు కూడా మారింది. ఒకప్పుడు నాయకుడు ఊళ్లోకి వస్తున్నాడంటే జనం ఆయనను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్లేవారు. పనులు మానుకుని ఆయన రాకకోసం ఎదురుచూసేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. నాడు నాయకుల మాటల్లో ..హావ బావాలలో హూందాతనం ఉట్టిపడేది. ప్రజలతో మమేకమయ్యేవారు. ప్రత్యర్థులను విమర్శించాల్సి వస్తే సహేతుక ..సంస్కారవంతమైన భాష ఉపయోగించేవారు. కానీ నేడు ..నాయకుల తీరు చూస్తున్నాం.. నోరు తెరిస్తే బూతులు. అబద్దాలు. మర్యాద అన్నది మచ్చుకు కూడా కనిపించదు. నాడు…
ఉపఎన్నికలో పోలింగ్ ముందు ఆ ఇద్దరి నేతల మధ్య వర్గపోరు బయట పడిందా? పార్టీని ఇరకాటంలో పెట్టేలా శ్రేణుల వైఖరి ఉందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏంటా గోల? లెట్స్ వాచ్..! గెల్లు, కౌశిక్‌రెడ్డి మధ్య గ్యాప్ తగ్గలేదా? ఉత్సాహంగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు బయటపడటం పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందట. హుజురాబాద్‌లో ఉపఎన్నికను టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారు.…
హుజురాబాద్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు వ్యవసాయంపై బ్రతుకుతారు. అందులో ఎక్కువగా వరి సాగే వుంటది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి సాగే అవుతుంది. సర్కార్ తుగ్లక్ పాలనలా.. నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం msp ప్రకటించింది.. దాని ప్రకారం కొనాల్సిందే. తెలంగాణను రైస్ బౌల్ చేస్తామన్నారు.. కేసీఆర్. ఇప్పుడు కొనం అని చెప్పడం సిగ్గు చేటు. సిద్దిపేట కలెక్టర్…
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్‌ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో…
హుజురాబాద్ అసెంబ్లీ బై ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి.. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని, కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయిన రాములమ్మ… హరీష్ రావు దళిత…
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి,…
కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ… ఈటలకు ఈ ఎన్నికలో భారీ మెజారిటీ రావాలి. ఏ సర్వే చూసినా… ఈటలదే విజయం అని పేర్కొన్నారు. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కేసీఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు…
అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ…
లక్ష రూపాయలు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నరు. కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూత బడ్డాయి అని విజయశాంతి అన్నారు. భూనిర్వాసితుల ఉసురుపోసుకున్నరు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. బతుకమ్మ చేరెలు కట్టుకొనెలా ఉన్నాయా అని ప్రశ్నించారు. దొరగారు వస్తె రోడ్డుపక్కన మా అక్క చెల్లెళ్ళు దండం పెడుతూ నిలబడలా. ఇదా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం దొరగారు. 7 ఏళ్లుగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క పథకం అమలు కాదు.…