హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే జమ్మి కుంట మండలంలో హై డ్రామా నెలకొంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ కిషన్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనికీ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిని సీపీ సోదా చేయడంతో అక్కడి వివాదం సద్దు మణిగింది. ఇక అటు…. మధ్యాహ్నం మూడు గంటల వరకు రెండు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంట వరకు 61.66 శాతం పోలింగ్ నమోదు కాగా.. బద్వేల్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ మాత్రమే రికార్డు అయ్యింది.