గత నెల 30 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని హుజురాబాద్, బద్వేల్ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలను జరిగాయి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, బద్వేల్ ఎమ్మెల్యే మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయింది. గత సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనుకున్నా, బీజేపీ బరిలో దిగడంతో ఎన్నిక నిర్వహించక తప్పలేదు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికలు సజావుగా ముగిశాయి.
Read: ఈ స్మార్ట్‌వాచ్‌కు ఒకసారి ఛార్జ్ చేస్తే…
కాగా, ఈరోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదటి అరగంటలోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ధ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నది. లెక్కంపు ప్రారంభం కావడంతో ఉత్కంఠత పెరిగింది.