జమ్మికుంటలో కిసాన్ మొర్చ సమావేశానికి ఈటల రాజేందర్, సోమారపు సత్యనారాయణ, యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రజలు కాదు. కేసీఆర్ కు టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నాడు. జిత్తుల మారి ఎత్తులతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడు. తన టక్కుటమార విద్యలు ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ…
కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి హరీశ్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ తన బాధను.. మనందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను.. మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధను మన బాధగా మార్చుకుని ఆగమవుదామా.. మనందరి బాధలు తీర్చే కేసీఆర్ కు అండగా ఉందామా.. ఆలోచించండి అని…
ఆర్థిక మంత్రిగా నేను రెండు పనులు ముఖ్యంగా చేశా.. ఒకటి హుజూరాబాద్ అభివృద్ధి అయితే.. రెండవది బీసీలలో ఉన్న కులాలతో అసెంబ్లీ లో మీటింగ్ పెట్టీ వారికి ఏం కావాలో ప్రతిపాదనలు చేసినం అని ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా జమ్మికుంటలోని మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ… రజకులకు 250 కోట్లతో డ్రై క్లీనింగ్ మిషన్ లు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే డబ్బులు లేవు అని కేసీఆర్ ఇవ్వలే. ఇప్పుడు నేను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తె గెలిస్తే…
ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ…
హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు మంచి నాయకుడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్ లో నింపారు. ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. అయితేప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్. ఆయన కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే…
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ…
ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఆస్తులు కాపాడుకోడానికి అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా కమలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ… తెరాస పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా, బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.బావుల కాడా మోటర్లకు మీటర్ల పెట్టమంటుంది,మార్కెట్ వ్యవస్థ రద్దు చేస్తా అంటుంది. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే,ఎడమ చేత్తో బీజేపీ గుంజుకుంటుంది. ఈనాడు ఈటల రాజేందర్ రైతుల ఉసురు…
హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు ఫీవర్ పట్టుకుంది. కొద్ది రోజులుగా లబ్ధిదారులు బ్యాంకుల ముందు బారులుతీరుతున్నారు. పెద్ద ఎత్తున బ్యాంకుకు తరలివస్తుండటంతో కొన్ని సార్లు పరిస్థితి గంధరగోళానికి దారితీస్తోంది. చాలా మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవలన్న ఆసక్తితో బ్యాంకుకు వెళుతున్నారు. దళితబంధుపథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 23 వేల మంది అర్హులను గుర్తించింది. అయితే ఇప్పటి వరకు 16 వేల ఖాతాలు మాత్రమే తెరిచారు. ఏడు వేల మంది…
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేశారు? అప్పట్లో GHMC ఎన్నికల్లో పార్టీ ఎత్తుకున్న టోన్‌నే ఇప్పుడు కొత్తగా అందుకున్నారా? లేక.. ప్రత్యర్థిపార్టీ ముందరి కాళ్లకు బంధాలేసే వ్యూహమా? ఇంతకీ కొప్పుల ఏమన్నారు? హుజురాబాద్‌లో కొప్పుల కామెంట్స్‌పై చర్చ..! షెడ్యూల్ విడుదలతో హుజురాబాద్‌లో ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది. ఎన్నికల వ్యూహాలకు ప్రధాన పార్టీలు మరింత పదును పెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్త్రాలు బయటకు…
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…