హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం చేస్తున్నాయి. గులాబీ పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పోలింగ్ నాటికి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపుతట్టాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలను హైకమాండ్ ఆదేశించింది. ఇటు అధికార టీఆర్‌ఎస్..అటు సిట్టింగ్ ఎమ్మెల్యే , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ప్రజలు ఈ హై ఓల్టేజీ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయం ఎవరికి..? అభివృద్ధి…
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్ వాచ్..! ఎడముఖం పెడముఖంగా కౌశిక్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..? హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్‌ఎస్ ఎక్కువ ఫోకస్…
హుజురాబాద్‌లో పార్టీలు కులాలు.. బలాల లెక్కలు తీస్తున్నాయా? గత ఎన్నికలకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉండటంతో.. వివిధ సామాజికవర్గాల వైఖరి అంతుచిక్కడం లేదా? ఏ వర్గం ఎటు.. పార్టీలకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఉపఎన్నికలో కాంగ్రెస్ బలం చాటగలదా? 2018లో జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పుడు జరగబోతున్న ఉపఎన్నికకు అస్సలు పోలిక లేదు. నియోజకవర్గ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది పోరాటం. అప్పట్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్…
ప్రస్తుతం పోలీసు దిగ్బంధంలోకి హుజూరాబాద్ వెళ్ళిపోయింది. నియోజకవర్గం చుట్టూ 11 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. ఆర్డీఓ కార్యాలయంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్ల డ్రోన్ లతో నిఘా పెట్టారు. మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్ వాహనాల సైతం తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిన్న ఒక్కరోజే 15 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నేడు అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధాన అభ్యర్థులు దూరంగా ఉన్నారు. ఎనిమిదో తేదీన బీజేపీ అభ్యర్థి ఈటల,…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తాచాటాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల రాజేందర్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు…
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం…
జమ్మికుంట లో బీజేపీ రైతు కిషన్ మోర్ఛ రెడ్డి సభ కు హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… హుజురాబాద్ గడ్డ మీద కేసీఆర్ కు డిపాజిట్ వస్తే నేను బాధ్యత వహిస్తా. చక్రవర్తులు, రాజుల చరిత్ర గురించి మన అందరికి తెలుసు. కానీ ఈ రాజు చరిత్ర…
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరగుతోంది. ఓ వైపు ప్రచార హోరు ..మరోవైపు నామినేషన్ల పర్వం. నామినేషన్ల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. కొంత కాలంగా ఆమె తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో…
కరీంనగర్ అబాది జమ్మికుంట బీజేపీ పార్టీలో ఈ రోజు భారీగా చేరికల జరిగాయి. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేసారు ఈటల రాజేందర్. మీ డబ్బులకు, మీ మద్యం సీసాలకు నాగార్జునసాగర్ కోదాడలో రిజల్ట్ రావచ్చు. కానీ హుజురాబాద్ లో మాత్రం ఆత్మగౌరవానికే రిజల్ట్ వస్తుంది అని స్పష్టం చేసారు. ఆత్మగౌరవ ప్రతీక,పేదప్రజల గొంతుక ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎవరి ఫ్లెక్సీలు, ఎవరి ముఖాలు ఉన్నాయి. ఈటల ఫ్లెక్సీలు, జెండాల పెడితే…
జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో ఆరే కులస్తుల గర్జన సభకు హాజరయ్యారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్,సెంట్రల్ ఓబీసీ మెంబర్ మోహన్ రావ్ పటేల్. ఆ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… నేను భూ కబ్జా చేస్తే, వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదిస్తే 18 సంవత్సరాలు నాతో కలిసి ఎలా ఉన్నారు అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అవసరం అనుకుంటే ఎవరితో అయిన మాట్లాడుతాడు. అవసరం లేదు అనుకుంటే ఎవరిని దగ్గరికి…