కేసీఆర్ కు ఓట్ల మీద తప్ప ప్రజలపై ప్రేమలేదు : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మికుంటలో కిసాన్ మొర్చ సమావేశానికి ఈటల రాజేందర్, సోమారపు సత్యనారాయణ, యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రజలు కాదు. కేసీఆర్ కు టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నాడు. జిత్తుల మారి ఎత్తులతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడు. తన టక్కుటమార విద్యలు ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చెల్లవని చెప్పే రోజు ఈనెల 30వ తేదీ. నా కొడుకంత వయస్సున్న ఒక వ్యక్తి నన్ను తమ్మి అని మాట్లాడుతున్నాడు. ఈటలను ఓడిస్తే మరో 20 ఏళ్లు తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలో ఉంచవచ్చని కుట్ర చేస్తున్నాడు. ఒకడికి 50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్లు, కరపత్రాలు పంచేవాళ్లు హుజురాబాద్ కు కోకొల్లలుగా వచ్చారు అని తెలిపారు. కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అనే ముద్ర వేసినట్లుగా… నన్ను ఎదుర్కొనే దమ్ములేక, కారణం చెప్పే ధైర్యం లేక భూ ఆక్రమణ ఆరోపణలు చేసారు.
ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తా.. లేకుంటా నీవు రాస్తావా అని నా భార్య సవాల్ చేస్తే స్పందించలేదు. హరీశ్ రావు అబద్ధాల కోరు.. ఒకప్పుడు ఆయనపై గౌరవం ఉండేది. మామకు బానిసై నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. 13, 14 తేదీల్లో మా కార్యకర్తలతో నేనే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే చెబుతున్నారు. మీరు మనుషులా, పశువులా, ఏం సంస్కారం మీదు. మీరు ఓ అమ్మకు పుట్టలేదా? మీకు భార్యలు లేరా అని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రలకు హుజురాబాద్ ప్రజలు ఘోరీ కడతారు. 13వ తేదీ దగ్గరకొస్తోంది. నాకు మాత్రం అనుమానం వస్తోంది. నాకు గన్ మెన్లు తగ్గించారు. మాజీ మంత్రికి ఒకే గన్ మెన్ ను ఇచ్చారంటే. ఏదైనా కుట్ర కేసీఆర్ చేస్తున్నట్లు అనుమానం వస్తోంది. ఆనాడు వై.ఎస్. మంత్రి పదవి ఆఫర్ చేసినా నేను లొంగలేదు. ఉద్యమాన్ని ఆర్పాలని ఓ ముఖ్యమంత్రి నా భూమి లాక్కున్నా నేను భయపడలేదు. నేను తాటాకు చప్పుళ్లకు బెదురుతానా అని అన్నారు. మీ బెదిరింపులకు నేను సమాధానం చెప్పను. మా ప్రజలే మీకు సమాధానం చెబుతారు. ఎన్నికలు వస్తేనే ప్రజల సమస్యల గుర్తొస్తాయి. కేసీఆర్ కు ఓట్ల మీద తప్ప ప్రజలపై ప్రేమలేదు. దళితబంధు ఇవ్వాల్సిందే..దానితో పాటు అన్ని కులాల్లోని పేదలకు కూడా పది లక్షలు ఇవ్వాలి. నా హుజురాబాద్ లైఫ్ లైన్ భూమి, పంట మాత్రమే. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని డిమాండ్ చేసాను తప్పా… కేంద్రం వడ్ల కొనమని చెబుతోందని కేసీఆర్ ప్రచారం చేస్తుంటే.. నేను కేంద్రమంత్రని అడిగాను. అదంతా అబద్ధమని కేంద్ర మంత్రి చెప్పారు. వడ్లు ఈసారి కూడా కొంటారు. కేంద్ర ప్రభుత్వం సహకారంపై మేము హామీ ఇస్తున్నాం. కేసీఆర్ డబ్బును, మోసాన్ని, దౌర్జన్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. నాతో ఎవరైనా తిరిగితే.. ఓ కారు వచ్చి వాళ్ల ఇంటి ముందు ఆపి హరీశ్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 10 వేల రూపాయలు వస్తున్నాయని కేసీఆర్ కు కళ్లు మండాయి. వాళ్లు డబ్బు సంపాదించుకుని ఫీల్డ్ అసిస్టెంట్లు సర్పంచులుగా పోటీ చేస్తున్నారని భావించి వాళ్లను తీసేసాడు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పన్నులతో కేసీఆర్ సోకులు చేసుకుంటున్నాడు. నన్ను గెలిపించి.. హుజురాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలి అని ఈటల పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?