జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో ఆరే కులస్తుల గర్జన సభకు హాజరయ్యారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్,సెంట్రల్ ఓబీసీ మెంబర్ మోహన్ రావ్ పటేల్. ఆ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… నేను భూ కబ్జా చేస్తే, వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదిస్తే 18 సంవత్సరాలు నాతో కలిసి ఎలా ఉన్నారు అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అవసరం అనుకుంటే ఎవరితో అయిన మాట్లాడుతాడు. అవసరం లేదు అనుకుంటే ఎవరిని దగ్గరికి రానివ్వడు. తెలంగాణ రాష్ట్రాన్ని 20సంవత్సరాలు భానిసత్వంలోకి నెట్టాలనే కుట్ర కేసీఆర్ ది. ఫామ్ హౌస్ నుండి కేసీఆర్, మరొక వ్యక్తి సింగపూర్ లో కూర్చోని కుట్రలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లకు ఇద్దరు గన్ మేన్ లు ఉంటారు. కాని నాకు ఒక్క గన్ మేన్ తో సరి పెట్టారు అని తెలిపారు.
ఒక్క నియోజక వర్గంలో 4వేల 700కోట్ల జీవోలు ఇచ్చిన చరిత్ర లేదు. కాని నన్ను ఓడగొట్టడానికి వేల కోట్ల జీవోలు వస్తున్నాయి. అయిన నాకు సంతోషంగా ఉంది. పేదరికానికి కులంలో సంబంధం లేదు. బీసీ బందు కూడా పెట్టాలి అని అన్నారు. తెలంగాణ తెచ్చుకుంది అడుక్క తినేందుకు కాదు. ఉద్యోగాల నోటిఫికేషన్ జాడ లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మూడేళ్లు అవుతుంది. అరే పిచ్చి నాయకుల్లారా మీకు ఏం అవగాహన ఉంది. దుష్టులకు దూరంగా ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ధర్మం, న్యాయం ప్రకారం ఎన్నికలు జరిగితే కేసీఆర్ కు డిపాజిట్ కూడ రాదు అని పేర్కొన్నారు ఈటల.