ఈ రోజు హుస్నాబాద్‌లో బీజేపీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని, మద్యం ఏరులై పారుతోందని, ఇంత చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నారని ఈటల పేర్కొన్నారు. అక్టోబర్ 30 న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందని, అన్ని జిల్లాల నుండి ఈటలను గెలిపించాలని…
హుజురాబాద్ ఉప ఎన్నికల సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. అలాగే ఈటెల రాజేందర్‌కు కూడా ఇది అగ్నిపరీక్ష. దాంతో ఇక్కడ ఎవరు జెండా ఎగరేస్తారన్నది ఆసక్తిగా మారింది. గులాబీదళం.. కమలదళం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాన్ని నిధులతో ముంచెత్తుతోంది. కోట్ల వ్యయంతో దళితబంధు ప్రోగ్రామ్ తెచ్చింది. అలా దళిత ఓటర్లకు దగ్గరవుతుంది. అందులో అనుమానం లేదు. ఇక ఈటెల బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టి..టీఆర్‌ఎస్ కూడా యాదవ కులస్తుడు గెల్లు…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తుల విలువ 2 లక్షల 82 వేలు కాగా, స్థిరాస్తుల విలువ 20 లక్షలుగా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన 4 లక్షల 98 వేలు. హుజూరాబాద్ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు…
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని…
హుజురాబాద్ బైఎలక్షన్ ఆ ఇద్దరు మంత్రులకు పరీక్షేనా? వారి రాజకీయ భవిష్యత్ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉందా? అందుకే కంటిపై కునుకు లేకుండా పోయిందా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఏమా కథా? హుజురాబాద్‌లో ఇద్దరు మంత్రులపై ఎక్కువ చర్చ..! హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉపఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నది అధికార టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన మరుక్షణం గులాబీ శ్రేణులు ఇక్కడ మోహరించి పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. షెడ్యూల్…
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు.…
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్‌ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్‌ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఈ మధ్యే హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయం పై ఆర్డీవో రిటర్నింగ్ అధికారి రవిందర్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం అవుతుంది. అయితే నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. 11 నుండి మూడు…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…