అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ…
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి? ఎన్నికల కోడ్‌తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి…
జమ్మికుంట పట్టణంలో వడ్డెర సంఘం గర్జన మీటింగ్ కు ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎన్ని బెదిరింపులు చేసిన లొంగని జాతి వడ్డెర జాతి. కేసులు పెట్టుకోండి, జెసిబి లు సీజ్ చేసుకోండి కానీ తెరాసా జెండా కప్పుకొనేది లేదని చెప్పారు. దళితులకు అందరికీ దళితబంధు అందించాలి అని, అన్నీ కులాలలో ఉన్న పేద వారికి 10…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారిపోయింది. రేసులో ఎంతమంది ఉన్నా వారంతా థర్డ్ ప్లేసుకోసమో పోటీ పడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అభ్యర్థి మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటల రాజేందర్ అసైన్డ్…
గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్‌తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది. అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది.…
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ…
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై…
ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.. ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు. అయితే,…
అన్ని అనుకూలిస్తే ఆ నేత హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేవాడు. కానీ అతడి వ్యూహం బెడిసి కొట్టడంతో ఆ సీటు చివరి నిమిషంలో దూరమైంది. దీంతో ఆ నేతకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సదరు నేతకు శాసన మండలిలో అడుగు పెడుతారని అంతా భావించారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే ఆ నేత ఎవరో ఓ క్లారిటీ వచ్చేసింది…