ఆర్థిక మంత్రిగా నేను రెండు పనులు ముఖ్యంగా చేశా.. ఒకటి హుజూరాబాద్ అభివృద్ధి అయితే.. రెండవది బీసీలలో ఉన్న కులాలతో అసెంబ్లీ లో మీటింగ్ పెట్టీ వారికి ఏం కావాలో ప్రతిపాదనలు చేసినం అని ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా జమ్మికుంటలోని మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ… రజకులకు 250 కోట్లతో డ్రై క్లీనింగ్ మిషన్ లు కొనివ్వాలని ప్రతిపాదన చేస్తే డబ్బులు లేవు అని కేసీఆర్ ఇవ్వలే. ఇప్పుడు నేను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తె గెలిస్తే ఇంకా ఎన్ని వస్తాయి చూస్తూ ఉండండి అన్నారు. ఓటు కి 20 వేలు ఇస్తారు అట తీసుకోండి. సీఎం ఇప్పుడే ఆగం ఆగం అయితుండు అట. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క బీసీ బిడ్డ కూడా సీఎం కాలేదు అని వారే అంటున్నారట. మేము ఉద్యమంలో అన్నం పెట్టిన, బెయిల్ కి డబ్బులు ఇచ్చినం. మరి ఎం తప్పు చేసిండు అని మంత్రి పదవి నుండి తీసివేశారు అని నా భార్య అడిగింది. ముక్కు నేలకు రాస్తా అంది. అయిన స్పందించలేదు. రజకులు చాకలి ఐలమ్మ వారసులు.. దొరతనాన్ని చీల్చి చెండాడుతారు. బండి సంజయ్ మీటింగ్ కి వస్తె కరెంటు కట్ చేశారు. ఇలాంటి చిల్లరపనులు వారికీ తగదు అని తెలిపారు. బీజేపీ మీటింగ్ కి పోవద్దని దావత్ లు ఇస్తున్నారు. బెదిరిస్తున్నారు. బెదిరింపులకు ప్రతి బెదిరింపులు ఉంటాయి. మా సహనానికి పరీక్ష పెట్టవద్దు. మాతో గొక్కోవద్దు. ధర్మం తో పెట్టుకోవద్దు. రజకులతో అసలు పెట్టుకోవద్దు అని ఈటల పేర్కొన్నారు.