ఆమె అనాధ.. తల్లిదండ్రులు చనిపోయారు.. ముగ్గురు అక్క చెల్లెలు.. వీళ్లు ముగ్గురు కలిసి జీవిస్తున్నారు.. ఇందులో ఒక్కరికి వివాహమైంది. అక్క చెల్లెలు అందరు కూడా సంతోషించారు.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు.. అక్క భర్త చేసే వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది.. అక్క చెల్లెల్ని వదిలి మళ్లీ మరొకసారి అనాధల్ని చేసింది.. బావ వేధింపుల వల్లే అక్క చనిపోయిందంటూ చెల్లెలు అందరు కలిసి ఫిర్యాదు చేశారు. గుండెపోటుతో మరణించింది అని చెప్తున్నప్పటికీ ఒంటిపై గాయాలు ఉండడంతో…
ఆమె.. మాజీ ప్రపంచ ఛాంపియన్. ఇండియన్ నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత. ఆమెనే సావీటీ బూరా. దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఈమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన భర్త, అత్తింటి వారు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక భర్త తన వికలాంగ భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలను అమ్మేశాడు. భార్య నిద్రపోతుండగా.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని ఆరోపణలు వచ్చాయి. భర్త అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. భార్య డబ్బు ఇవ్వక పోవడంతో ఈ నీచమైన పని చేశాడని భార్య పేర్కొంది.
చిన్న చిన్న కారణాలకే కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కళ్లు తెరిచి చూసేలోపే అంతా చీకటైపోతుంది.
పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది.
ఆలుమగలు అన్నాక చిన్న చిన్న గొడవలు.. కోపాలు.. తాపాలు ఉండడం సహజమే. కొద్దిసేపటి తర్వాత మరిచిపోయి మళ్లీ కలిసి పోతుంటారు. ఇలా దంపతుల మధ్య జరుగుతూనే ఉంటాయి. యూపీలో ఓ జంట మాత్రం పెళ్లికి వెళ్లే విషయంలో తగాదా పడి.. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులు ఇవ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని అయితే 300 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా ఇవ్వాలంటూ ఆమెను హింసించాడని, డబ్బులు ఇవ్వడానికి జమీల నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు.
భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. అలకలు ఉంటాయి. కొద్దిసేపు కోపం ఉంటుంది. మరికొద్దిసేపటికే కలిసి పోతుంటారు. ఇలా ప్రతి సంసారంలోనూ కామన్గా జరుగుతుంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కాపురాలు కూలిపోతాయి.
ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.