కామాంధులు, పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు. Also Read:Virat Kohli: అన్ని ఆలోచించాకే రిటైర్మెంట్ ప్రకటించా.. కోహ్లీ…
గుంటూరు జిల్లాలోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ వివాహిత.. అయితే, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో సంచనల అంశాలు వెలుగు చూశాయి..
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్లో ఉన్న పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి…
సంసారాల్లో చిన్న చిన్న గొడవలు రావడం సర్వ సాధారణం. కానీ నేటి రోజుల్లో చిన్న గొడవలే దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య చోటుచేసుకుంటున్న మనస్పర్ధలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, పరాయి వ్యక్తులపై మోజు ఇలాంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు (మం) పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన…
ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోగా.. యువకుడి ఫ్యామిలీ అంగీకరించింది. ఇక, వీరి సంసార జీవితం ఓ 15 రోజుల పాటు గడిచిందో లేదో ఫాసియా తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. రక్తసంబంధికుల మధ్య బంధాలు క్షీణిస్తున్నాయి. అనంతరం ప్రతీకారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కలకాలం తోడుండాల్సిన భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
ఆదర్శదంపతులుగా నిండు నూరేళ్లు కలకాలం జీవించాల్సిన వారు అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. పరాయి వాళ్ల మోజులో పడి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అంబర్ పేటలో ఓ భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి…
Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు.
కర్ణాటకలోని హోసూర్లో దారుణం జరిగింది. ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బంజరు పొలాల్లో బాలిక ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఒక స్త్రీ, పురుషుడు ఉన్న కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో తెగవైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.