ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.
Also Read:RCB Playoffs: ఈ సాలా కప్ నమ్దే.. ఇదే జరిగితే ఆర్‌సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్..!
జౌన్‌పూర్ జిల్లాకు చెందిన ఆర్తి పాల్ (26) రాజు పాల్‌కు మూడవ భార్య అని చౌబేపూర్ ఎస్‌హెచ్‌ఓ జగదీష్ కుష్వాహా తెలిపారు. రెండు వివాహాలు విఫలమైన తర్వాత, రాజు పాల్ మే 9న ఆర్తిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిసేపటికే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓ రోజు రాత్రి తన భార్య శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
Also Read:Annamaya District: పీలేరులో అదుపుతప్పి బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి
అక్కడికి చేరుకున్న పోలీసులు భర్త దాడిలో గాయపడ్డ ఆర్తిని నర్పత్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడైన భర్తపై హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భార్యను కొట్టి చంపిన అనంతరం నిందితుడు ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.