HYD Wife Death: భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. కానీ ఏం లాభం!
- మాధవితో కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం
- ఇద్దరు హైదరాబాద్‌లోనే నివాసం
- వీరికి ప్రస్తుతం 11నెలల కుమారుడు
- భార్య మాధవిపై అనుమానంతో పలుసార్లు గొడవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది. అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్త నుంచి ఆ ఇల్లాలు దూరంగా వెళ్లిపోయింది. కాని అలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. తమిళనాడులో శవమై కనిపించింది. అసలు ఆ భార్యభర్త మధ్య ఏం జరిగింది? జోగులాంబ గద్వాల్ జిల్లా కొండపల్లికి చెందిన మాధవితో వనపర్తి జిల్లా నాగల్ కడ్మూర్‌కి చెందిన కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో ఇరువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. వీరికి ప్రస్తుతం సుమారు 11నెలల కుమారుడు ఉన్నాడు. దంపతులిద్దరూ ఉద్యోగులు కావడంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారానికి.. భర్త శివ అనుమానం చీడ పురుగుగా మారింది. భార్య మాధవిపై అనుమానంతో పలుసార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి.
Also Read:Perni Nani: మహిళా జెడ్పీ చైర్పర్సన్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారే సైకోలు..
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
చిన్నగా మొదలైన ఈ గొడవలు కాస్తా.. పెద్దల పంచాయితీ వరకు వెళ్లాయి. అనేక మార్లు పంచాయితీలు పెట్టిన భర్త శివ బుద్ధిలో ఎలాంటి మార్పు రాకపోగా అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో భార్య మాధవికి అనేక ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం మాధవిని ఉద్యోగం కూడా మాన్పించాడు. ఆమె ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరాయి. భర్త అనుమానంతో మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లొ నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు అక్కడ ఇక్కడ ఆరా తీసిన భర్త శివ.. చివరకు హైదరాబాద్ లోని పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read:JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్‌గా..
హైదరాబాద్‌లో అదృశ్యమైన మాధవి తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనిపించింది. రైల్వే ట్రాక్‌పై మాధవి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఇక పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన మాధవి తల్లిదండ్రులు, భర్త శివ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని అత్తగారింటికి తరలించారు. విషయం తెలుసుకున్న మాధవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించారు. భర్త శివ కుటుంబ సభ్యులపై దాడికి దిగడంతో నాగల్ కడ్మూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భర్త శివ వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక మాధవి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!