భార్యలపాలిట యుముడిగా మారిన భర్తలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు. అక్రమసంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోనమ్ అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ప్రియుడి సాయంతో కిరాయి హంతకులను పెట్టి చంపించింది. అంతకు ముందు మీరట్ లో ముస్కాన్ కూడా తన భర్తను ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ తో కప్పేసింది. ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఘటన కలకలం రేపింది. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడుతో కలిసి దాడి చేసింది ఓ భార్య.
Also Read:Seven Hills Express: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తు్న్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు
ఏడాదిక్రితం షైస్తాను అనే మహిళ ఓసామా ను వివాహం చేసుకుంది. ఆరు నెల క్రితం భర్త షైస్తాను దుబాయ్ కి పంపించింది. భర్తను దుబాయ్ కి పంపి షైస్తాను అమీర్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల తిరిగి వచ్చిన ఓసామాకు విషయం తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన షైస్తాను సుపరి గ్యాంగ్ ను పెట్టుకొని భర్త ఓమాపై ప్రియుడుతో కలిసి దాడికి పాల్పడింది. ఈ దాడిలో భర్త ఒసామాకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.