భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. కలకలం కలిసుండాల్సిన ఆలుమగలు.. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ కాపురాలను కూల్చుకుంటున్నారు. నిత్యం ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. కేసులు.. జైళ్ల పాలవుతున్నా.. మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది.
ఇది కూడా చదవండి: Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి ఉండగా సడన్‌గా భర్త ప్రత్యక్షమయ్యాడు. దీంతో బెంబేలెత్తిపోయిన మహిళ.. 12 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. అనంతరం బైక్‌పై పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం ప్రియుడు శోభిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Kerala High Court: కేరళ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై సామాన్యులు పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లను ఉపయోగించలేరు
2019లో కాకోర్ గ్రామానికి చెందిన వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లికి ముందు నుంచి మహిళకు పలువురి పురుషులతో సంబంధాలు ఉన్నట్లుగా భర్త ఆరోపించాడు. దీంతో కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక సోమవారం బరౌత్ పట్టణంలోని చప్రౌతి రోడ్డులోని ఒక హోటల్‌కు ప్రియుడు శోభిత్‌తో కలిసి మహిళ వచ్చింది. వీరిద్దరూ హోటల్‌కు బయల్దేరిన దగ్గర నుంచి భర్త, అత్తమామలు వెంబడిస్తూ వచ్చారు. ఇక హోటల్ దగ్గరకు వచ్చాక.. హఠాత్తుగా భర్త ప్రత్యక్షమయ్యాడు. కంగారులో భయాందోళన చెందిన మహిళ 12 అడుగుల ఎత్తులోంచి కిందకు దూకేసింది. అనంతరం బైక్‌పై పారిపోయింది. ఇక ప్రియుడు శోభిత్ అక్కడే ఉండిపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి.
అయితే తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాకముందు నుంచే తన భార్యకు అనేక మంది పురుషులతో సంబంధాలు ఉన్నాయని.. తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరిస్తోందని.. అభ్యంతరం చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన రోజు ఎస్పీ కార్యాలయంలోని మహిళా విభాగంలో వివాహ కౌన్సెలింగ్ జరిగినట్లు భర్త పేర్కొన్నాడు. కౌన్సెలింగ్ జరుగుతుండగానే.. ఇంకోవైపు ప్రియుడితో జల్సాగా తిరుగుతోంది. పక్కా ప్రణాళికతో భర్త స్కెచ్ వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Shocking: In UP's Baraut, a married woman jumped from an OYO hotel wall to escape after her in-laws caught her with her lover. #Baraut #UttarPradesh #OYOHotel #UPNews #ViralVideo #FamilyDrama #WomanEscapes #ITRaid #OperationSindoor #Peddi #TelAviv #IranVsIsrael #WednesdayWisdom… pic.twitter.com/KtFyA2xXbY
— Vayam Bharat (@vayambharat) June 18, 2025