ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహా సముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పెంచారు.
భారత్- బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు జరిగినట్లు అనేక కథనాలు వస్తున్నాయి. వీటిల్లో భారత్- ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు.
ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్‌లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు.
యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించిన స్థావరాలపై అమెరికా- బ్రిటన్ దళాలు బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో హౌతీ రెబల్స్ కు సంబంధించిన పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల నిల్వలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారులు సమాచారం అందించారు.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి.