US-UK: హౌతీ తిరుగుబాటుదారులపై దాడి.. జో బైడెన్, రిషి సునాక్ రియాక్షన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi rebels: యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించిన స్థావరాలపై అమెరికా- బ్రిటన్ దళాలు బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో హౌతీ రెబల్స్ కు సంబంధించిన పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల నిల్వలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారులు సమాచారం అందించారు. ఇక, ఎర్ర సముద్రంపై తీవ్రవాద గ్రూపులపై దాడులను అమెరికా, దాని మిత్రదేశాలు సహించబోవని తెలియజేసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అమెరికా దాని మిత్రదేశాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ చర్య తీసుకున్నాయన్నారు. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ షిప్పింగ్‌పై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ హౌతీ రెబల్స్ దాడుల వల్ల అమెరికన్ సిబ్బంది, పౌరులతో పాటు మా భాగస్వాములు ప్రమాదంలో పడ్డారు.. వాణిజ్యం ప్రమాదంలో పడింది, నావిగేషన్ స్వేచ్ఛ ప్రమాదంలో పడింది అని జో బైడెన్ చెప్పుకొచ్చారు.
Read Also: Infosys-TCS Update: టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల్లో 11,961 ఉద్యోగాల కోత
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అలాగే, హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే సైనిక స్థావరాలపై రాయల్ వైమానిక దళం లక్షిత దాడులు చేసిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓ ప్రకటన విడుదల చేశారు. యెమెన్ రాజధాని సనాలో ఇవాళ తెల్లవారుజామున నాలుగు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ ఓడరేవు ప్రాంతంలో ఐదు భారీ పేలుళ్లు సంబవించినట్లు తెలిపారు. ఈ ఓడరేవు నగరం హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఇప్పటి వరకు ఉన్నదని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ వెల్లడించారు. వాణిజ్యానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!