Israel Hamas Conflict: ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి లాంటి సముద్రగర్భ కేబుల్స్‌పై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, భారత్- బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు జరిగినట్లు అనేక కథనాలు వస్తున్నాయి. వీటిల్లో భారత్- ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. యెమన్ తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ తీగలు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒక దానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది.
Read Also: Mangalavaaram: మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది
అయితే, మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలెం పోస్ట్, గ్లోబెక్స్ కథనాలు వెల్లడించాయి. డేటాసెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలను సైతం వ్యక్తం చేస్తోంది. దెబ్బ తిన్న వాటిల్లో ఏఏఈ-1, సీకామ్, యూరప్-ఇండియా గేట్‌వే, టాటా గ్లోబల్ నెట్‌వర్క్ అట్లాంటిక్‌కు చెందినవి ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
Read Also: Nani : నాని నెక్స్ట్ సినిమాల లైనప్ మాములుగాలేదుగా.. లైన్లో అరడజను సినిమాలు..
ఇక, ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణ సేనలు రెడీ అయిన వేళ.. బాబ్-ఎల్-మండెప్ దగ్గర నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీ తిరుగుబాటుదారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని అండర్‌సీ కేబుల్స్ చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒకవేళ, అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ లాంటి కీలకమైన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
1. ఏఏఈ-1 కేబుల్: ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో లింకై ఉంది. అంతేకాదు.. చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతోనూ కలుపుతుంది.
2. యూరప్- ఇండియా గేట్‌వే కేబుల్: దక్షిణ ఐరోపా మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్‌కు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.
3. సీకామ్ కేబుల్: ఐరోపా, ఆఫ్రికా, భారత్, సౌతాఫ్రికా దేశాలను అనుసంధానం చేస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పని చేస్తున్నాయి.