Houthi Rebels: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో యెమెన్ హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో భీభత్సాన్ని సృష్టిస్తున్నారు. నవంబర్ నుంచి హౌతీలు ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందాబ్ జలసంధి, ఏడెన్ గల్ఫ్‌లోని ముఖ్యమైన షిప్పింగ్ యార్డ్ ల పరిధిలోని నౌకలపై పదే పదే డ్రోన్, క్షిపణిలతో దాడులను నిర్వహిస్తుంది. తాజాగా, గురువారం యెమెన్ నౌకాశ్రయ నగరమైన మోఖాకు పశ్చిమాన 19 నాటికల్ మైళ్ల దూరంలో ఎర్ర సముద్రం సమీపంలో పేలుడు సంభవించినట్లు ఒక వ్యాపార నౌక వెల్లడించింది. దీనిపై బ్రిటిష్ అధికారులు విచారణ చేస్తున్నారు.
Read Also: Shoaib Akhtar:”1999 ప్రపంచ కప్ చరిత్రను పాకిస్తాన్ జట్టు మరోసారి పునారావృతం చేసింది”
ఇక, యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కూడా మోఖాకు దక్షిణాన 27 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన సంఘటన గురించి నివేదిక వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు బ్రిటిష్ అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్తున్న వాణిజ్య నౌక వెళ్తోందని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఆ ఓడ సమీపంలో పేలుడు సంభవించడంతో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ పంపలేదు అని పేర్కొంది.
Read Also: CS Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్.
కాగా, హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై తరచూ దాడులు చేయడం వల్ల ఓడ వాహక నౌకలు తమ సరుకులను దక్షిణాఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ప్రయాణాలకు చేయవల్సి వస్తుందని భద్రతా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మధ్య ప్రాచ్యంలో అస్థిరతను సృష్టించే అవకాశం ఉందని భయపడుతున్నారు. అలాగే, ఇరాన్‌తో సంబంధాలను కలిగి ఉన్న హౌతీ మిలీషియా, యెమెన్‌లోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలను నియంత్రిస్తుంది. గాజాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ హౌతీ రెబల్స్ పని చేస్తున్నారు.