హౌతీ రెబెల్స్‌ను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు దేశాలు హెచ్చరించాయి. ఈ దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, అమెరికా హెచ్చరికలను హౌతీ రెబల్స్ పట్టించుకోలేదు.. మరోసారి వాణిజ్య షిప్స్ పై దాడులకు దిగింది.
Red Sea: ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకలతో పాటు, రెడ్ సీలో ఇతర దేశాలకు చెందిన నౌకలపై కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.
Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్‌కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత…
Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు…
Israel Hamas War: హౌతీ తిరుగుబాటుదారులు కార్గో షిప్ చాలా సినిమాటిక్ శైలిలో హైజాక్ చేశారు. ఇటువంటి చర్యలు తరచుగా చిత్రాలలో మాత్రమే కనిపిస్తాయి కాని హౌతీ తిరుగుబాటుదారులు దానిని సముద్రం మధ్యలో కదులుతున్న ఓడలో చూపించారు.