విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్‌లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి…
'ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం... దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం...' అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది.
ఎవరైనా బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్‌క్రీమ్‌లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్‌లో తినే భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
దూర ప్రాంతాలకు ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడ మనకి ఎవరూ తెలియనివారు లేకపోతే బయట హోటల్లో స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది.. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు తో హోటల్స్ ఉంటాయి.. కొన్ని హోటల్స్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నా బిల్లు చూస్తే తడిసి మోపడి అవుతుంది.. ఒక హోటల్లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే లగ్జరీ హోటల్స్‌లో ధరలు లక్షల్లోనే వుంటాయని మీకు ఐడియా…