బెంగళూరులో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్ చేశారు. భయాందోళనకు గురైన మహిళ అమాంతంగా హోటల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రగాయాలు పాలైంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: ప్రధాని మోడీని ఎవరూ దూషించలేదు.. కానీ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది
కొంత మంది అమ్మాయిలు ఆదివారం బెంగళూరులోని ఒక హోటల్‌లో బస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మూడు గదులు బుక్ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1 ఒంటి గంట నుంచి 5 గంటల వరకు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే హోటల్ నుంచి శబ్దాలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేవారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. దీంతో 21 ఏళ్ల మహిళ భయాందోళనకు గురై హోటల్ బాల్కనీ డ్రెయిన్ పైప్ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కిందపడి పోవడంతో తీవ్రగాయాలు పాలైంది. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సీ ఎస్టా లాడ్జ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కనీ ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు లేవని.. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు నియామకం.. తమిళనాడుకు ఎవరంటే..!