ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది.
జనగామ జిల్లాలో ప్రేమవ్యవహారం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజులకే ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఇద్దరి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Harirama Jogaiah: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరినట్లు తెలుస్తోంది. 63 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో ఆమెను చేరారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా యువ పేసర్ కూడా చేరాడు. టీమిండియా పేసర్, రాజస్థాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. తన అనారోగ్య పరిస్థితి గురించి ఖలీల్ అహ్మద్…
Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ జబ్బు అయినా ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇక ప్రసవం కోసం ప్రైవేటుకు వెళ్తే ఎలా? సాధారణ కాన్పు జరిగే పరిస్థితి ఉన్నా.. భయపెట్టి శస్త్రచికిత్సలు చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇందులో వాస్తవం లేకపోలేదు.. దీంతో, కొందరు అటు ప్రైవేట్‌లో.. ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుంటూ.. డెలివరీ సమయానికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితే.. సాధారణ కాన్పునకు ప్రయత్నమైనా చేస్తారనేవారు కూడా ఉన్నారు.. మరోవైపు.. ఆడ పిల్ల పుడితే చీదరించుకునేవాళ్లు కూడా…
NCP Cheif Shard pawar hospitalized : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు.