తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ నియామకాలకు ప్రక్రియ ప్రారంభించింది. లిఖిత పూర్వక పరీక్షలు పూర్తయ్యాయి. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరుగుపందెం, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు బయో మెట్రిక్ ద్వారా హాజరును తీసుకోనున్నారు. అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇవన్నీ నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగార్థులకు గురువారం నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ఇవి ప్రారంభం అవుతున్నాయి. అభ్యర్థుల్ని గంట ముందుగానే అనుమతిస్తున్నారు. అభ్యర్థులు ఎవరి మాయలోనూ పడొద్దని, డబ్బులిస్తే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా ప్రలోభ పెడితే తమకు కంప్లైంట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
Read Also: Andhra Pradesh: 2034లో చనిపోతా.. మరణ వేడుకలకు రావాలని మాజీ మంత్రి ఆహ్వానం
పోలీస్ నియామకల్లో భాగంగా వరంగల్ కాకతీయ యూనివర్శిటీ మైదానంలో నిర్వహిస్తున్న దేహ దారిద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అస్వస్థత గురయ్యాడో అభ్యర్థి. అతడిని వెంటనే MGMకు తరలించిన పోలీస్ అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఆ అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు అవసరమయిన వైద్య చికిత్స అందిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఒక అభ్యర్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే ఎంజీఎంకి చేరుకున్నారు. అనారోగ్యం పాలైన అభ్యర్థికి అందిస్తున్న చికిత్సను పరిశీలించడంతోపాటు అభ్యర్థి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ అభ్యర్థికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులకు సూచించారు.
Read Also: West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత