కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా.. దాదాపు వారం తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్.. ఈ సాయంత్రం సర్ గంగారామ్ ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారని మరియు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు…
రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని..…
34 ఏళ్ల నాటి రోడ్డు రేస్ కేసులో పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్యజోత్ సింగ్ సిద్దూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆయన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేరారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్‌కి పోలీసులు తరలించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్దూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Destination…
విశాఖ లోని అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి 9 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ లతో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులు, ఎక్స్ పర్ట్స్ అభిప్రాయాలు తీసుకోవాలని కోరామన్నారు మంత్రి అమర్ నాథ్. అసలు ఎక్కడ నుండి గ్యాస్ లీక్ అయిందో…
హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్.జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్‌జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు – వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూరై్తనా ఇప్పటికీ ఆస్తుల…
మానవత్వం మంట కలిసింది. ఖాకీ నిర్లక్ష్యానికి మూడు నెలల చిన్నారి బలైంది.ఓ కన్న తల్లి కడుపు కోతకు కారణమైంది. వెయ్యి రూపాయల చలాన్ అభం శుభం తెలియని చిన్నారి ఉసురు తీసింది.యాదగిరిగుట్ట పోలీసుల దాష్టీకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జనగామ జిల్లాకు చెందిన దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించడంతో.. ఓ ప్రైవేట్ కారులో హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు…
కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని ఎద్దేవ చేశారు. గీతారెడ్డి…
అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదు. పదిమందికి సాయం చేయడం. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ దారి ఇచ్చి.. అందులో వున్న రోగుల్ని కాపాడారు. అదే బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి…
నదిలో పడ్డ వ్యక్తిని కాపాడిన పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు.. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల్ని రక్షించారు. ఆపదలో ఎవరు వున్నా.. విధి నిర్వహణలో వున్న పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటూ వుంటారు. గుంటూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/ ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…