NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Cheif Shard pawar hospitalized : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. శరద్ పవార్ మూడు రోజుల పాటు చికిత్స పొందనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్ సీపీ ప్రకటన విడుదల చేసింది. పవార్ వార్తతో ఆయన అభిమానుల్లో ఒక్క సారి అలజడి చెలరేగింది. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.
Read Also: Gujarat Cable Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 12మంది బీజేపీ ఎంపీ కుటుంబీకులు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ నవంబర్ 3న డిశ్చార్జి కానున్నారని పార్టీ తెలిపింది. అంతవరకు ఆయన పాల్గొనబోయే పార్టీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగబోయే ఎన్సీపీ క్యాంపునకు ఆయన హాజరవుతారని తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్ పిత్తాశయ సమస్య కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
Read Also: Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E
— NCP (@NCPspeaks) October 31, 2022
- Tags
- hospital
- mumbai
- NCP
- shard pawar
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..