వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతమవుతున్నాయి. ప్రియురాలు పిలిచిందని ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు.. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పిలిచి కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి గోడదూకితే చితక బాదామని ప్రత్యర్ధులు చెబుతున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నోములలో జరిగింది.చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇక్కడ చూడండి.. కొరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ యువకుడి పేరు జానయ్య. ఈ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు..
Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?
అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోని జంట.. నల్లగొండ జిల్లాలోని నోములలో పెళ్లైన మహిళతో జానయ్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని నెలలుగా ఈ అక్రమ వ్యవహారం బాగానే నడిచింది. కానీ విషయం మహిళ భర్తకు తెలియడంతో గొడవలు షురూ అయ్యాయి. మొదట మహిళను మందలించారు ఆమె కుటుంబ సభ్యులు. ఆ తరువాత జానయ్యను కూడా పిలిచి మందలించారు. మరోసారి ఇలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు రాలేదు. దీంతో పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి… ఇద్దరినీ మందలించారు. ఐతే పెద్దల సమక్షంలో తప్పును ఒప్పుకున్న ఇద్దరూ మరోసారి తప్పు జరగదని హామీ ఇచ్చారు…జానయ్యకు మహిళ ఫోన్ చేసింది
ఇంటికి రావాలని పిలిచింది .ఇక అంతా సర్దుకుంది.. సెట్ అవుతుంది అనుకున్న క్రమంలో మహిళ, జానయ్య మధ్య మళ్లీ వివాహేతర బంధం చిగురించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జానయ్య తీరును జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలో జానయ్యకు మహిళ ఫోన్ చేసింది. ఇంటికి రావాలని కోరింది. మహిళ రమ్మన్న సమయానికి జానయ్య ఇంటికి వెళ్లాడు.
Murugan Devotees Meet: నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్ !
ఆ తరువాత తీవ్ర గాయాలతో ఇంటిముందు చెట్టుకు కట్టేసి కనిపించాడు జానయ్య…పథకం ప్రకారం పిలిపించి కొట్టారని బంధువుల ఆరోపణ.తీవ్ర గాయాలతో ఉన్న జానయ్యను చూసిన అతని స్నేహితులు అతన్ని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జానయ్య చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. పథకం ప్రకారం జానయ్యకు మహిళతో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తున్నారు జానయ్య బంధువులు. జానయ్యను పథకం ప్రకారం ఇంటికి పిలిపించిన మహిళ భర్త నాగరాజు, కూతురు, అత్త కలిసి జానయ్యపై దాడి చేశారని చెబుతున్నారు. విచక్షణారహితంగా కొట్టి ఆ తరువాత ఇంటి ముందు చెట్టుకు కట్టేసారని అంటున్నారు… వివాహిత బంధువులు మాత్రం.. జానయ్య తమ ఇంటి గోడ దూకాడని.. దీంతో అతనిపై చెయ్యి చేసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు జానయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు..