హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్ 2024ను లాంచ్ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్ డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్‌లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది.…
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’.. విద్యుత్ వాహన రంగం (ఈవీ)లోకి ఎంట్రీ ఇస్తోంది. హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. తన పాపులర్ మోడల్ యాక్టివానే ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. టీజర్‌ను చూస్తే.. యాక్టివా లుక్స్ ఈవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్టివాలో పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే…
Honda vs Hero Sales: పండుగ సీజన్ వేళ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’కు మరో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో నమోదైన రిటైల్ విక్రయాల్లో హీరోను హోండా దాటేసింది. దేశంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలు విక్రయించిన కంపెనీగా హోండా అగ్రస్థానంలో ఉంది. గత నెల రిటైల్ సేల్స్‌కు సంబంధించిన గణాంకాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్…
హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది.
Honda Monkey Bike Price and Mileage: వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీల నడుమ తీవ్ర పోటీ నడుస్తోంది. మార్కెట్లో తమ డిమాండ్‌ను నిలబెట్టుకునేందుకు అన్ని కంపెనీలు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రధానంగా బైక్‌ల విషయంలో పోటీ బాగా ఉన్న నేపథ్యంలో ‘హోండా’ కంపెనీ సరికొత్త చిన్న బైక్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. హోండా మంకీ 125 పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ బైక్ జపాన్‌లో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్‌లలో బాగా ప్రాచుర్యం…
Honda launches Honda Dio 125 Scooter in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేసింది. గురువారం భారత మర్కెట్‌లో ‘హోండా డియో 125’ స్కూటర్‌ను విడుదల చేసింది. డియో స్కూటర్ ఇప్పటి వరకు 110 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 125 సీసీ ఇంజన్‌తో వచ్చింది. ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు…
2023 Honda Shine 125 Launched in India: హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్స్ ఇండియా ఇప్పటికే సరికొత్త ‘యునికార్న్’ మరియు ‘డియో’ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త షైన్ 125ను (Honda Shine 125) రిలీజ్ చేసింది. ఈ బైక్ BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. కొత్త రంగులు, అప్ డేటెడ్ ఫీచర్లతో విడుదలైన ఈ బైక్.. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా విడుదల చేశారు. హోండా షైన్ బైక్…
New Honda Unicorn Launch 2023: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా ‘యునికార్న్’ బైక్‌ను గతంలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్‌లో సరికొత్త అప్‌డేట్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. కొత్త రియల్ డ్రైవింగ్ ఉద్గార నిబంధనల ప్రకారం (BS6 OBD2 PGM-FI) హోండా ఈ మోటార్‌సైకిల్ ఇంజన్‌ని అప్‌డేట్ చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన OBD 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా యునికార్న్ బైక్‌ను…
Honda Launches Honda Dio in India: హోండా మోటార్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా సరికొత్త ‘డియో’ స్కూటర్‌ను (Honda Dio Launch 2023) విడుదల చేసింది. హోండా డియో స్కూటర్ ప్రారంభ ధర రూ. 70,211. నూతన హోండా డియో ఇప్పుడు 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ మరియు స్మార్ట్ వేరియంట్‌లలో వస్తుంది. స్టాండర్డ్ ధర రూ. 70,211 ఉండగా.. డీలక్స్ ధర రూ. 74,212లుగా ఉంది. ఇక…
Pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రముఖ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆటోమోబైల్ దిగ్గజం హోండా కూడా పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పింది. బుధవారం తన ప్లాంట్ ను మూసేస్తున్నట్లు హోండా ప్రకటించింది. సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణం అని…