ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’.. విద్యుత్ వాహన రంగం (ఈవీ)లోకి ఎంట్రీ ఇస్తోంది. హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. తన పాపులర్ మోడల్ యాక్టివానే ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. టీజర్‌ను చూస్తే.. యాక్టివా లుక్స్ ఈవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్టివాలో పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
నవంబర్ 27న హోండా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. Activa Electric లేదా eActiva పేరుతో ఇది రిలీజ్ అవనుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల వరకు ఉండవచ్చు.ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100-110 కిమీల పరిధిని ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి బ్యాటరీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ తెలియరాలేదు. భారత్‌లో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ స్కూటర్‌తో పోలిస్తే.. ఈవీ అధునాతన ఫీచర్లతో రానుంది.
Also Read: Toyota Offers 2024: ఇయర్ ఎండ్ ఆఫర్.. ఈ టయోటా కార్లపై లక్ష తగ్గింపు!
ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి కొత్త సంస్థలు విద్యుత్ స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తున్నాయి. బజాజ్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం మెరుగైన విక్రయాలు నమోదు చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగానైనా హీరో మోటోకార్ప్ కూడా ఈవీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో హోండా కూడా త్వరలోనే ఈవీని తీసుకురాబోతోందంటూ కొన్ని నెలలుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోండా టీజర్‌ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది. హోండా ఎంట్రీతో విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో పోటీ తీవ్రం కానుంది.