Honda Unicorn Launch: సరికొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా.. బెస్ట్ ఫీచర్లు! 10 సంవత్సరాల వారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Honda Unicorn Launch 2023: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా ‘యునికార్న్’ బైక్‌ను గతంలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్‌లో సరికొత్త అప్‌డేట్ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. కొత్త రియల్ డ్రైవింగ్ ఉద్గార నిబంధనల ప్రకారం (BS6 OBD2 PGM-FI) హోండా ఈ మోటార్‌సైకిల్ ఇంజన్‌ని అప్‌డేట్ చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన OBD 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా యునికార్న్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ బైక్ అద్భుతమైన లుక్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది.
Honda Unicorn Price:
హోండా యునికార్న్ బైక్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.1,09,800గా ఉంది. హోండా యునికార్న్ పథ మోడల్ కంటే.. కొత్త మోడల్ ధర రూ.4100 వేలు ఎక్కువ. కొత్త అప్‌డేట్‌ల కారణంగా ఈ బైక్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. హోండా కంపెనీ ఇంజన్‌కి సంబంధించిన అప్‌డేట్‌లతో పాటు పలు కాస్మెటిక్ మార్పులను చేసింది. ఇది 160సీసీ ప్రీమియం బైక్. ఇందులో లాంగ్ సింగిల్ పీస్ సీట్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
Honda Unicorn Colors:
హోండా యునికార్న్ యొక్క ఈ అప్‌డేట్ వెర్షన్ బైక్ నాలుగు కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ కలర్‌లలో ఈ బైక్ వస్తుంది.
Honda Unicorn Warrenty:
హోండా యునికార్న్ బైక్‌ను కొనుగోలు చేస్తే మీరు 10 సంవత్సరాల వారంటీని పొందుతారు. ఇందులో 3 సంవత్సరాల ప్రామాణిక మరియు 7 సంవత్సరాల పొడిగింపు వారంటీ ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ, సీట్ ఎత్తు 798 మిమీ, కర్బ్ వెయిట్ 140 కిలోలు. ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లుగా ఉంది.
Honda Unicorn Features:
యునికార్న్ బైక్‌లో 130 ఎంఎం బ్యాక్ డ్రమ్ బ్రేక్ మరియు 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ ఉన్నాయి. ఈ బైక్‌కి మోనోషాక్ రియర్ సస్పెన్షన్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది మూడు-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మీకు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Honda Unicorn Mileage:
ఈ బైక్‌లో 160 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 13 హెచ్‌పీ పవర్ వద్ద 14.58 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త హోండా యూనికార్న్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికలో అందుబాటులో ఉంటుంది. ఇది 50 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది.
Also Read: MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!