2023 Honda Shine 125 Launched in India: హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్స్ ఇండియా ఇప్పటికే సరికొత్త ‘యునికార్న్’ మరియు ‘డియో’ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త షైన్ 125ను (Honda Shine 125) రిలీజ్ చేసింది. ఈ బైక్ BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. కొత్త రంగులు, అప్ డేటెడ్ ఫీచర్లతో విడుదలైన ఈ బైక్.. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా విడుదల చేశారు. హోండా షైన్ బైక్ ఇప్పటికే భారత్‌లో సేల్స్ ద్వారా సరికొత్త రికార్డును లిఖించింది. కొత్త మోడల్‌కు కూడా అదే మాదిరి సేల్స్ ఉంటాయని కంపెనీ భావిస్తోంది.
Honda Shine 125 New Model Price:
కొత్త హోండా షైన్ 125 బైక్ డ్రమ్, డిస్క్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. బేస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.79,800 కాగా.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.83,800లుగా ఉంది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ బైక్ సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. కొత్త హోండా షైన్ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ) మరియు హోండా ఏసీజీ స్టార్టర్‌తో జత చేయబడింది.
Also Read: Airtel New Plan 2023: ఎయిర్‌టెల్ నుంచి చౌకైన ప్లాన్ వచ్చేసింది.. 35 రోజుల పాటు అపరిమిత కాలింగ్, డేటా!
Honda Shine 125 New Model Specs:
కొత్త హోండా షైన్ 125 బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 10.74పీఎస్ పవర్ మరియు 11ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ ఇప్పుడు OBD2 మరియు E20 ఇంధనానికి అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ఐదు-దశల అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను అందించారు. ఇక ముందువైపు 240 ఎమ్ఎమ్ డ్రమ్ / 130 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. వెనుకవైపు 130 ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టాప్-ఎండ్ మోడల్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటాయి.
Honda Shine 125 New Model Colors:
హోండా షైన్ 125 కొత్త బైక్‌లో ఇంజన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏ బైక్ 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. బ్లాక్, జెన్నీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు డీసెంట్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. కొత్త బైక్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. బాడీ-కలర్ కౌల్, బాడీ-కలర్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్-పీస్ సీటు అలానే ఉన్నాయి. హెడ్‌లైట్ కౌల్, సైడ్ ప్యానెల్‌లు అదనంగా వస్తన్నాయి.
Also Read: Langur Viral Video: అచ్చు మనిషి లానే.. పానీపూరి ఇష్టంగా తింటున్న కొండముచ్చు! వీడియో చూస్తే షాకే