Honda Amaze 2024: హోండా కొత్త ‘అమేజ్’ వచ్చేసింది.. లీటర్‌కు రూ.19.46 కిమీ ప్రయాణం!
- హోండా నుంచి కొత్త అమేజ్ లాంచ్
- అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలు
- అమ్మకాల్లో అమేజ్ వాటా 40 శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్ 2024ను లాంచ్ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్ డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్‌లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 5.80 లక్షల యూనిట్లను విక్రయించింది. భారతదేశంలో హోండా అమ్మకాల్లో అమేజ్ వాటా 40 శాతంగా ఉండడం విశేషం.
హోండా అమేజ్ మూడు వేరియంట్లలో (వీ, వీఎక్స్, జడ్‌ఎక్స్) అందుబాటులో ఉంది. అమేజ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ.7.99 (ఎక్స్ షోరూమ్)గా.. జడ్‌ఎక్స్ వేరియంట్ ధరను రూ.10.90 లక్షలుగా ఉంది. ఈ కారులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 89 బీహెచ్‌పీ పవర్, 110 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటర్‌కు 18.65 కిమీ మైలేజ్.. సీవీటీ వేరియంట్ రూ.19.46 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్‌లకు కొత్త అమేజ్‌గట్టి పోటీ ఇవ్వనుంది.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
హోండా అమేజ్ ముందువైపు డీఆర్‌ఎల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాంగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను ఇచ్చారు. 15 ఇంచెస్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. 8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇవ్వగా.. అది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాక్ అవే ఆటోలాక్.. వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొత్త అమేజ్ ఆరు ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సర్ వంటి సదుపాయాలతో వచ్చింది.
Also Read: IND vs AUS 2nd Test: భారత్, ఆస్ట్రేలియా డే/నైట్ టెస్ట్.. సెషన్ టైమింగ్స్ ఇవే!
హోండా అమేజ్ ధరలు:
అమేజ్ V MT – రూ. 8 లక్షలు
అమేజ్ V CVT – రూ. 9.20 లక్షలు
అమేజ్ VX MT – రూ. 9.10 లక్షలు
అమేజ్ VX CVT – రూ. 10 లక్షలు
అమేజ్ ZX MT – రూ. 9.70 లక్షలు (ఏడీఏఎస్)
అమేజ్ ZX CVT – రూ. 10.90 లక్షలు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!