శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టినట్లు హోంమంత్రికి ఎస్పీ వివరించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని హోం మంత్రికి ఎస్పీ రత్న తెలిపారు. బాధిత మహిళలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్న హోం మంత్రి సూచించారు.
READ MORE: Shyamala Rao: వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 30 లక్షల లడ్డూల విక్రయం..
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
READ MORE:Pendrive: టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం!